రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి…
సాక్షిత ప్రతినిధి కోదాడ) టీ తాగటానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కోదాడ మండలం ద్వారకుంట గ్రామానికి చెందిన జక్కుల శివ (48) ప్రతిరోజు మాదిరిగానే ద్విచక్ర వాహనంపై కోదాడ పట్టణానికి టీ తాగేందుకు బయల్దేరాడు. ఈ క్రమంలో కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్న సమయంలో మేళ్లచెరువు వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న శివ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శివకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. రహదారిపై వాహనాల వేగ నియంత్రణ లేకపోవడమే ఇటువంటి ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
