గ్రామాలభివృద్ధే లక్ష్యంగా
సర్పంచులు పనిచేయాలి……………. సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులుపలుస శంకర్ గౌడ్
….
సాక్షిత వనపర్తి :
వనపర్తి నియోజకవర్గం
శ్రీరంగాపూర్ మండలంలో శ్రీరంగాపూర్ గ్రామపంచాయతీ, తాటిపాముల, మరియు కంభలాపూర్ గ్రామపంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారములో పాల్గోని శంకర్ గౌడ్ అభినందించారు.శ్రీరంగాపూర్ సర్పంచ్ ముంత మద్దిలేటి, ఉపసర్పంచ్ ఖాజా, తాటిపాముల సర్పంచ్ .ముంత శిరీష మద్దిలేటి, ఉపసర్పంచ్ గంధం కుర్మయ్య, కంభలాపూర్ సర్పంచ్ విజయ్ రెడ్డి, ఉపసర్పంచ్ నార్య నాయక్ మరియు వార్డు సభ్యులను పలుస శంకర్ గౌడ్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడాడు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి కోసం రాజకియాలకు అతితంగా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామ ప్రథమ పౌరులుగా గ్రామానికి మంచి పేరు తిసుకు రావాలన్నారు.
మహాత్మాగాంధీ కలలుకన్న స్వరాజ్యం తీసుకుని రావాలన్నారు. సోమవారం నూతన సర్పంచులుగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగాసర్పంచులు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కోసం అందరి సహకారముతో అభివృద్ధి చేయాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధి పథంలో సాగాలని కోరారు.ఈ కార్యక్రమం లో సుదర్శన్ రెడ్డి , బి.రాజు, ఎ. రాములు,యెల్లాస్వామి,బుచన్నా, రంగన్న,హరికృష్ణ, బోయాశ్రీను, బొమ్మాయి రామన్న,గంధంస్వామి, రంజిత్, లోక్య నాయక్ తడితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
