మెప్మా శాఖలో భారీ కుంభకోణం
పల్నాడు జిల్లా లో మెప్మా శాఖలో లోతైన దర్యాప్తు
జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల
మెప్మా శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో నకిలీ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి, సుమారు రూ.10 కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై గురువారం నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్కామ్ వెనుక ఉన్న వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అవసరమైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలన్నా వెనుకాడవద్దు అంటూ జిల్లా కలెక్టర్‌కు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ మెప్మా స్కామ్‌పై లోతైన దర్యాప్తు కొనసాగుతుండగా, త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని కలెక్టర్ సమాచారం.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
