సంకెపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ లను అభినందించిన ఎమ్మెల్యే
శంకర్పల్లి సాక్షిత
శంకర్పల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంకెపల్లి గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ గా దేశ్ పాండే శ్రీనివాస్, ఉప సర్పంచ్ గా ఉప్పరి రవీందర్ సగర, వార్డ్ మెంబర్లుగా తాళ్లపల్లి రుక్కమ్మ, కవ్వగూడెం మల్లేశం యాదవ్, ఉప్పరి లావణ్య శ్రీనివాస్ సగర, తోకల గోవర్థన్ యాదవ్, తోకల సబిత పరమేశ్వర్ యాదవ్ లు భారీ మెజారిటీతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడం కోసం కృషి చేస్తానని, గ్రామాభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
