దొంతాన్ పల్లి గ్రామ సర్పంచ్ గా అబ్దుల్ అజీజ్ మహమ్మద్
శంకర్పల్లి: సాక్షిత
శంకర్పల్లి మండలంలోని దొంతాన్ పల్లి గ్రామ సర్పంచ్ గా అబ్దుల్ అజీజ్ మహమ్మద్ విజేతగా గెలిచారు. సర్పంచ్ ఎన్నికలలో ప్రత్యర్థి అభ్యర్థి పై 34 ఓట్ల మెజార్టీతో విజయ డంకా మోగించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో సర్పంచ్ గా అవకాశం ఇచ్చినందుకు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధికి ప్రజలతో కలిసి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో మిగిలి ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికి గ్రామంలో అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని తెలియజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
