ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాజయోగ ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక అవగాహన, అంతరంగిక శాంతి మరియు నైతిక విలువల వ్యాప్తికి కీలక పాత్ర పోషిస్తూ, వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు సామాజిక సౌహార్దానికి తన వంతు సహకారం అందిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు .ఈ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందుతాయన్నారు . మాధాపూర్ డివిజన్ పరిధి మాతృశ్రీ నగర్‌లో ఏర్పాటు చేసిన హార్మనీ హైట్స్ (ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం) కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కూకట్పల్లి మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలు బండి రమేష్ దంపతులు మరియు జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి పాల్గొన్నారు .ఓం శాంతి ఇన్‌చార్జ్‌లు, బ్రహ్మకుమారీస్ సోదరీమణులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
“ఓం శాంతి” అనేది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఇశ్వరియ విశ్వవిద్యాలయంలో విస్తృతంగా ఉపయోగించే పవిత్ర ఆధ్యాత్మిక అభివాదం. దీనికి లోతైన అర్థం, ఉద్దేశ్యం ఉన్నాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు
“ఓం శాంతి” అనే పదం ద్వారా మనము శరీరాలు కాదు ఆత్మలమనే సత్యాన్ని, అలాగే మన అసలైన స్వభావం శాంతియేనని గుర్తుచేస్తుందని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్ అన్నారు
సంస్థ ప్రధానంగా రాజయోగ ధ్యానానికి ప్రసిద్ధి. ఇది ఆత్మను అవగాహన చేసుకోవడం, పరమాత్మతో అనుసంధానం సాధించడం ద్వారా అంతరంగిక శాంతి, ఆత్మబలం పెంపొందించే ఆధ్యాత్మిక సాధన విధానం. అలాగే ధ్యానం, ఒత్తిడిని ఎదుర్కొనే విధానాలు, సంబంధాల మెరుగుదల మరియు విలువల ఆధారిత జీవనశైలిపై ఉచిత శిక్షణలు, వర్క్‌షాప్‌లను అందిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, పుష్ప రెడ్డి, ఫణి కుమార్ , నయీమ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
