చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అటల్ బీహార్ వాజ్ పేయి
వేమిరెడ్డి దంపతులు
మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి మరియు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి భారత రాజకీయాలలో సుపరిపాలనకు, అభివృద్ధికి చిరునామాలుగా నిలిచిన మహా నాయకులన్నారు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కలిసి ఆయన అటల్-మోడి సుపరిపాలన బస్సు యాత్ర పాటు నెల్లూరు నగరం ముత్తుకూరు బస్ స్టాండ్ వద్ద జరిగిన అటల్ బిహారి వాజ్ పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి” తో మాట్లాడుతూ 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వాజ్పేయి ప్రతిపక్ష నేతగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం శుభపరిణామం అన్నారు.
అనంతరం “ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి” మాట్లాడుతూ పరిపాలన దక్షతకు మారుపేరైన మహానాయకులు మాజీ అటల్ బిహారి వాజ్ పేయి, ప్రధాని నరేంద్ర మోడి పేరిట తలపెట్టిన అటల్-మోడి సుపరిపాలన బస్సు యాత్రలో చాలా సంతోషంగా వుందన్నారు. భారతరత్న మాజీ ప్రధాని వాజ్ పేయి ని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో నాడు చంద్రబాబు నాయుడు ఎన్డిఎ ఛైర్మన్ హోదాలో జాతీయ స్థాయిలో ప్రతి పక్షాలను ఏకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బిజెపి రాష్ట అధ్యక్షులు మాధవ్, జిల్లాకు చెందిన ఎంపి, ఎమ్మెల్యేలు,జిల్లాకు చెంది బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
