అమరజీవి పొట్టి శ్రీరాములు కారణజన్ములు – వేమిరెడ్డి దంపతులు
- పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్టం ఏర్పడింది.
తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్టం ప్రాణ త్యాగం చేసి అమరజీవిగా చరిత్రికెక్కిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం అన్నారు వేమిరెడ్డి దంపతులు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని చెన్నూరు రోడ్డులో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరజీవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపి ప్రభాకర్ రెడ్డి పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్టం ఏర్పడిందన్నారు.
తెలుగువారి ఆత్మ గౌరవం కోసం 1952 లో నాటి మద్రాసు నగరంలో 58 రోజుల నిరాహార దీక్ష ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆయన కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములు అసాధారణ త్యాగం, ఆయన నిబద్ధతలను ప్రశంసించారు. గాంధీ ప్రేరణతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళడానికి కూడా వెనుకాడని శ్రీరాములు ధీరత్వాన్ని ఆమె కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బుచ్చి పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, ఎంవి శేషయ్య, టీడీపీ అధ్యక్షులు టంగుటూరి మల్లికార్జున్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు. వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్ లతో పాటు కొన్సిలర్లు, టీడీపీ యూనిట్, క్లస్టర్, బూత్ కమిటీ కన్వీనర్లు, బిజెపి, మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
