10 ఓట్ల తేడాతో గెలిచిన గోపులారం సర్పంచ్ తంగడిపల్లి రవీందర్ రెడ్డి
సాక్షిత శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని గోపులారం సర్పంచ్ గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి తంగడిపల్లి రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మీద 10 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. నూతన సర్పంచ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థుల ప్రేమ, అభిమానాల వల్ల తాను గెలిచానని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ లు పొడవు శ్రీనివాస్, మీర్జాగూడ రవీందర్ గౌడ్ నూతన సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను అన్ని పరిష్కరిస్తానని చెప్పారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శేరి అనంత్ రెడ్డి, జన్వాడ మాజీ ఎంపీటీసీ మల్లేష్ గౌడ్ ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
