కాలనీ అభివృద్ధి వైపుగా సంక్షేమ సంఘాలు పనిచేయాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ..
132 – జీడిమెట్ల డివిజన్ గంగా ఎనక్లేవ్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిపుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా కాలనీ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాస ప్రధాన కార్యదర్శి హరి కాంత్ లతో పాటు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ…కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమని, సంక్షేమ సంఘాల సభ్యులు ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు వారధిగా ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కిష్టయ్య, రమేష్, డి.బి.వర్మ, సంయుక్త కోశాధికారి రఘురామా రెడ్డి, బాలాజీ, ట్రెసరర్ జీవన్ రెడ్డి, బంగారు రెడ్డి, ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
