విశాఖలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
విశాఖపట్నం: విశాఖ భీమిలిలోని కాపులుప్పాడలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ (Imaginnovate Techsolutions (India) Pvt Ltd) సంస్థకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.140 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఇమాజిన్నోవేట్ సంస్థ సీఈవో వి.భార్గవ్ కృష్ణ, డైరెక్టర్ వి. కృష్ణప్రియ, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
