ఎర్రవరం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రచారం స్పీడ్ పెంచిన కాంగ్రెస్ పార్టీ………
కత్తెర గుర్తుపై ఓటు వేసి రావూల భవాని వెంకటేశ్వర్లు ను గెలిపించాలని ప్రచారం
సాక్షిత ప్రతినిధి కోదాడ )
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రావుల భవాని వెంకటేశ్వర్లు గెలిపించాలంటూ గ్రామంలో పలు వార్డులలో వార్డు మెంబర్లుతో కలసి ఓట్లను అభ్యర్థించారు. పెద్ద ఎత్తున ముమ్మర ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి భవాని మాట్లాడుతూ కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
గ్రామంలో అర్హులై పెన్షన్ రాని వారు కొత్త పెన్షన్ దారుల దరఖాస్తులు చేసుకోగానే అధికారులతో మాట్లాడి ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు డొంక రోడ్ల నిర్మాణం, గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయించి ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఇప్పిస్తానని తెలిపారు . గ్రామంలో ప్రధాన సమస్యలను ఎజెండాగా తీసుకొని గ్రామ పెద్దలతో చర్చించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో యువత, గ్రామ పెద్దలు, ప్రజలలో మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
