మహాలింగపురం గ్రామ సర్పంచ్ గా ఆశీర్వదిస్తే.. గ్రామ అభివృద్ధికి పెద్దపీట వేస్తా
కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించండి
మహాలింగపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి: చేకూర్త కిష్టారెడ్డి
శంకర్పల్లి: సాక్షిత): మీ వాడిని… మీలో ఒక్కడిని… మీ మధ్యే ఉంటూ ఆశీర్వదిస్తే మహాలింగాపురం గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానని మహాలింగపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి చేకూర్త కిష్టారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుపై ఓటువేసి గెలిపిం చాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా తల్లి గ్రామ మాజీ సర్పంచ్ గా, తాను మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సింగల్ విండో డైరెక్టర్ గా పనిచేశానని గుర్తు చేశారు. గ్రామాభివృద్ధికి అందరి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్థానని తెలిపారు. అవకాశం ఇస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామంలో సిసి రోడ్లు పూర్తి చేయడంతో పాటు, డ్రైనేజి సమస్యలను శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు పరిశుభ్రతపై దృష్టి పెట్టి ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దుతాన ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులను గ్రామానికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తూ వారి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతామ న్నారు. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగుతా అన్నారు.
గ్రామంలో ప్రతి ఇంటి సమస్యనా సమస్య దిశగా కృషిచే స్తానన్నారు. మీ అందరి సహాకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలను గ్రామ పెద్దల సహకారం తీసుకొని అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తానని తెలియజేశారు.

