రేషన్ కార్డు సగటు పేద వాడి 10 ఏళ్ల కళ . : ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ ద్వారా పేదల 10 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించింది.ప్రతి పేద వాడు కడుపు నిండా తినాలన్న తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని ఎంఎల్ఏ పేర్కొన్నారు.పెంచిన సన్న బియ్యం పేదలందరికీ అందాలని ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు.భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ కార్డులు సైతం ఇదే తరహాలో యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని తెలిపారు.మెరుగైన ఆహారం, విద్య, వైద్యం ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పురుద్ఘటించారు.గత ప్రభుత్వం తమ చేతగాని తనన్ని ఒప్పుకోకుండా మళ్ళీ సిద్దిపేట అద్దె నాయకులతో పనికిమాలిన ధర్నాలు చేస్తూ పరువు తీసుకుంటున్నారని మండిపడ్డారు.ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల కళ్ళు మండి ప్రభుత్వం పై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ప్రజలు నాగరిక యుగంలో ఉన్నారని ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుసుకుంటున్నారని , BRS నాయకులు అబద్దాలతో పరువు తీసువద్దని హితవు పలికారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
