బీసీ రిజర్వేషన్లపై మా పోరాటం ముగిసింది, ఇప్పుడు నిర్ణయం బీజేపీదే: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బీసీలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లుపై మా చివరి పోరాటాన్ని పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన భాగాన్ని పూర్తి చేసిందని, ఇప్పుడు బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రం, ముఖ్యంగా బీజేపీపై ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదు
“రాష్ట్రపతి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి, ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తిరస్కరించడానికి కేంద్రం కారణాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగ బద్ధతకు పరీక్ష” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
బిల్లు ఆమోదం లేకపోతే స్థానిక ఎన్నికలపై పునరాలోచన
“బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్‌మెంట్. కేంద్రం ఆమోదం లేకుంటే, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో మేము పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. ప్రజల అభిప్రాయాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
బీసీలపై ప్రేమ ఉన్నట్లైతే బిల్లును ఆమోదించండి
“బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే, బీజేపీ ఈ బిల్లును ఆమోదించ

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
