నడివీధి గంగమ్మ”కు అంబలి మొక్కులు
** పూజల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆకుతోట వీధిలో మంగళవారం నడివీధి గంగమ్మకు అంబలి పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజల్లో బీజేపీ సీనియర్ నేత పి.నవీన్ కుమార్ రెడ్డి పాల్గొని అమ్మవారికి నైవేద్యం పెట్టి నగర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థన చేశారు. ఈ సందర్బంగా మేళ తాళాల నడుమ నడివీధి గంగమ్మకు తలిగవేసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చి ప్రతి ఇంటి నుంచి అంబలి తయారుచేసి నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆకుతోటవీధి, తీర్థకట్టవీధి, పంటవీధి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రతి సంవత్సరం నడివీధి గంగమ్మ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు.
గంగమ్మ తల్లి ఆశీస్సులతో నగరంలో తాగునీటి సమస్య రాకుండా సకాలంలో వర్షాలు పడాలని, విష జ్వరాలు… అంటు వ్యాధులు ప్రబలకుండా నగర ప్రజలంతా సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండాలని ఆ గంగమ్మ తల్లికి నమస్కరించి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానని నవీన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన కుమార్ రెడ్డి, పొన్నాల చంద్ర, సి.కే రవిలతోపాటు ఆకుతోట వీధి నిర్వాహకులు కటారి రమేష్ రెడ్డి, ఇర్ల వెంకట రమణారెడ్డి, గురువారెడ్డి, సురేష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, రమేష్ బాబురెడ్డి, రెడ్డప్పరెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, యతి, జయచంద్రారెడ్డి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
