నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన మహానుభావుడు అసమనతులు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత భారత రాజ్యాంగాన్ని ప్రాణం పోసిన మహనీయులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నిజాంపేట్, రాజీవ్ గృహకల్ప, ప్రగతి నగర్ కమాన్ బావార్చి దగ్గర ఉన్న విగ్రహాలను పూలమాలవేసి నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ కలలుగొన్న స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రతి ఒక్కరు చేస్తూ ఆయన అడుగుజడలో నడవాలని దళిత రత్న అవార్డు గ్రహీత నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఐక్యవేదిక చైర్మన్ మేకల నగేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సేవల సేన జాతీయ సంస్కృతిక సేన అధ్యక్షులు డాక్టర్ ఎస్ పి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రనాయక్, గోపాల్ మహారాజ్ , దళిత రత్న అవార్డు గ్రహీత మరియు మాల కులాల యునైటెడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కొదమగండ్ల అమృతయ్య, బాల పీరు, ముత్యాలు, లబిశెట్టి నరేష్ గుప్తా,పాల శ్రీనివాసులు,సురేష్, శ్రీనివాసులు,రవీందర్ నాయక్, మల్లయ్య నాయక్, శంకరన్న, దుర్గయ్య, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
