రైతుల సంక్షేమం పట్టని జగన్ రెడ్డి
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: వైసీపీ అధినేత, ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి.. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసి,.. ఇప్పుడు ఆయనేదో రైతు బాంధవుడినంటూ..ఊదర కొట్టడం చూస్తున్న ప్రజలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు.
రైతన్నా మీకోసం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం అయింది.
విజయవంతం చేసిన రైతులందరికి ధన్యవాదాలు.
రైతన్న సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు , కూటమి ప్రభుత్వం….
అన్నదాత సుఖీభవ – పియం కిసాన్ పథకం కింద రెండు విడతలుగా 46,85,838 రైతుల ఖాతాలలో రూ .6,310 కోట్లు జమ చేసాము.
90 శాతం సబ్సిడీ పై బిందు సేద్యం ద్వారా రైతులకు రూ .1654 కోట్ల లబ్ది.
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పన జరుగుతున్నది .
రైతులకు వ్యవసాయం లాభసాటి కావాలని పంచ సూత్రాలు అమలుకు నిర్ణయం ..
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం.. అన్నదాతలకు అండగా నిలుస్తోంది..ఐతే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి.., కేవలం రాజకీయ లబ్ధి కోసమే పనిచేసే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
అరటి రైతుల కోసం అనేక చర్యలు తీసుకుంటోంది, ముఖ్యంగా ధరల పతనం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా, కనీస మద్దతు ధర అందేలా చూడటం, వ్యాపారులతో రోజూ సమావేశాలు నిర్వహించడం రైతులకు ఆర్థిక సహాయం అందించడం వంటివి ఉన్నాయి.
రైతులకు మార్కెట్లలో స్థిరమైన ధరలు లభించేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
గిట్టుబాటు ధర అరటిపండ్లకు గిట్టుబాటు ధర లభించేలా చూడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరలు… కొనుగోళ్లపై ప్రతిరోజూ వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా నగదు బదిలీ చేయబడుతుంది. దీంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీలు ఉంటాయి.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
