పట్టణ వికలాంగుల సాధికారికా కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి జోనల్ ఆఫీస్ లో జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో 24 సర్కిల్ పరిధిలో నిర్వహించిన “ప్రపంచ వికలాంగుల దినోత్సవము – 2025” కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు ఇవ్వడం జరిగింది అని, అలానే ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 వ తేదీన జరుపుకుంటారు అని, దీన్ని యునైటెడ్ నేషన్స్ సంస్థ 1992 లో ప్రారంభించబడినదని, “సమాజ అభివృద్ధికి తగిన, వికలాంగులకు అనుకూలమైన సమాజాన్ని ఏర్పరచడం”.
ముఖ్య ఉద్దేశ్యం అని, వికలాంగుల హక్కులు, గౌరవం, సమాన అవకాసాలు, సమాజంలో పూర్తి మెరుగైన భాగస్వామ్యాన్ని పెంచడం. వికలాంగులు ఎదుర్కొనే సమస్యలు, అనేక సవాళ్లు, అవకాసాల లోటు, అందుబాటు లోపం, విద్యా, ఉద్యోగ, ఆరోగ్య, సామాజిక మద్దతు లో భాగంగా, అందరూ భాగస్వామ్యంగా ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు కలిసి వికలాంగుల కోసం సమన్వయం, మద్దతు, అవకాశాలు కల్పించాలి అని కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉమాదేవి, కూకట్పల్లి ప్రాజెక్ట్ ఆఫీసర్ భోగేశ్వర్లు, పట్టణ స్థాయి వికలాంగుల ఫెడరేషన్ అధ్యక్షులు లక్ష్మీపతి, సెక్రటరీ బాలాజీ, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ పాపన్న గౌడ్, ముస్తఫా సుజాతా మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
