తెలంగాణ గవర్నర్ తో టీటీడీ ఛైర్మన్ సమావేశం
** చైర్మన్ అమలు చేస్తున్న సేవలపై గవర్నర్ ప్రశంసలు
సాక్షిత ప్రతినిధి – హైదరాబాద్ / తిరుపతి: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు సమావేశమయ్యారు. ఈమేరకు హైదరాబాద్ లోని గవర్నర్ బంగ్లాలో టీటీడీ చైర్మన్ మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ ను తిరుమల స్వామివారి శాలువాతో సత్కరించి టీటీడీ తీర్థప్రసాదాలను అందించారు. టీటీడీలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు భేషుగ్గా ఉన్నాయని గవర్నర్ బీఆర్ నాయుడును అభినందించారు. గవర్నర్ స్వరాష్ట్రమైన త్రిపురలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ ఛైర్మన్ కోరారు. త్రిపురలో శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయిస్తే ఆలయ నిర్మాణాన్ని టీటీడీ చేపడుతుందని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
