లాలాపేట లో త్వరలో స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్ ప్రారంభం:

Sakshitha news

లాలాపేట లో త్వరలో స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్ ప్రారంభం
: భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి : ఎం ఎల్ ఏ పద్మరావు గౌడ్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తున్నామని, లాలాపేట లో కొత్త ముల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరపాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, , మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం లాలాపేట ప్రాంతంలో పద్మారావు గౌడ్ పర్యటించారు. లాలాపేట లో జీ.హెచ్.ఎం.సీ. ద్వారా రూ.12 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పనులను తనిఖీ చేశారు.

అదే విధంగా రూ.13 కోట్ల ఖర్చుతో వైద్య శాఖ నిర్మిస్తున్న 50 పడకల కొత్త ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడతూ పేద, మధ్య తరగతులకు చెందిన వారి వివాహాది శుభకార్యాలకు అనువుగా లాలాపేట లో మంచి హంగులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. అదే విధంగా అధునాతన హంగుల స్విమ్మింగ్ పూల్, కార్పోరేట్ తరహా వైద్య సేవలు ఉచితంగా అందించే ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో నిలపాలని ఆదేశించారు. అంతర్జాతీయ పోటీల నిర్వహణకు వీలుగా స్విమ్మింగ్ పూల్ లో వివిధ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు మాధవి, వేణు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Scroll to Top