సర్పంచ్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన : పోలీసు సిబ్బంది

Sakshitha news

సర్పంచ్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన : పోలీసు సిబ్బంది

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం
స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తారీఖు నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉన్నందున అశ్వారావుపేట మండలంలోని నామినేషన్ సెంటర్లను పరిశీలించిన అశ్వారావుపేట సిఐ నాగరాజు రెడ్డి అశ్వారావుపేట మండలంలో ఏర్పాటు చేసిన ఎనిమిది నామినేషన్ సెంటర్లను అశ్వారావుపేట ఎస్సై అఖిల మరియు సిబ్బందితో కలిసి తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. మండల పౌరులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అనుసరించి ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంతరాలు ఎదురైన డయల్ 100 సేవలను వినియోగించుకొవాలని కోరారు.

Scroll to Top