శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో కాల భైరవునికి ప్రత్యేక పూజలు
శంకర్పల్లి: సాక్షిత): శంకర్పల్లి మండలం పరిధిలోని చిందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో కాలభైరవ అష్టమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, క్షేత్ర పాలకునికి, శివుడికి ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారిని దర్శించుకుని, బూడిద గుమ్మడి కాయలలో నేతి దీపాలు వెలిగించి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం కొంపల్లి కి చెందిన జయశ్రీ పురుషోత్తం దంపతులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి అన్నదాతను స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, రాజు, రాజిత సంతోష్ కుమార్, వాసవి, గౌరీ శంకర్ ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
