సయ్యద్ ఇంతియాజ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు

Sakshitha news

సయ్యద్ ఇంతియాజ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు …

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ జన్మదినం సందర్భంగా, హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ రాజకీయ జీవితంలో ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తన ఆశీర్వాదాలు అందజేశారు…

ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యూత్ మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top