ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డి.ఎస్.పి రామకృష్ణ చారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ తిరుపతిలో టీటీడీకి చెందిన కోదండరామ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ట్రాఫిక్ నిర్వహణ, హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ సంకేతాలు, జీబ్రా లైన్ల వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థులు రోడ్లపై నడుస్తున్నప్పుడు పాటించాల్సిన రక్షణ సూచనలు, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడకం గురించి ట్రాఫిక్ సిబ్బందితో కలిసి స్పష్టమైన వివరణలు అందించారు.
జిల్లా ఎస్పీ సందేశం వివరిస్తూ… రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత. చిన్నపిల్లల్లోనే ట్రాఫిక్ శిక్షణ పెంపొందితే భవిష్యత్తులో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి. సురక్షితంగా ఉండటం అత్యంత ముఖ్యమైనదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ లు రత్నం, వెంకటేష్, పోలీస్ పీఆర్వో చంద్ర, స్కూలు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
