ఏపీఐఐసి బోర్డు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కనికళ్ల చిరంజీవి కి శుభాకాంక్షలు తెలిపిన జవ్వాది
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ బోర్డ్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కనికళ్ల చిరంజీవిని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంలో ఆయనకు పుష్పగుచ్చం అందజేసి, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాదల రమేష్ బాబు, జాలాది దానియేలు, యోమినేని సుధాకర్ బాబు, కట్టెపోగు రాజీవ్, తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
