జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నూతనంగా శాసనసభ్యుడిగా ఎన్నికైన నవీన్ కుమార్ యాదవ్ ని ప్రమాణ శ్రీకారోత్సవ కార్యక్రమం సచివాలయంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.టీపీసీసీ ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .ప్రమాణ స్వీకారం అనంతరం నవీన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి సమస్యల పరిష్కారంలో ముందుండాలని రమేష్ సూచించారు.

