ఇల్లంద గ్రామ చెరువు కట్ట బుంగ పడగా నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు …
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామ చెరువు కట్ట బుంగ పడిన విషయంపై వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకుని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు . పరిస్థితిని జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి కి టెలిఫోన్ ద్వారా వివరించి, కట్ట మరమ్మత్తు పనులను తక్షణమే ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారు….
రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగినచర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు. చెరువు కట్టను శాశ్వతంగా బలపరిచే విధంగా పనులు చేయించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గ్రామ పెద్దలు, గ్రామస్తులకు హామీ ఇచ్చారు…
ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ, ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చెరువు కట్టను పూర్తిగా బలోపేతం చేసి శాశ్వత పరిష్కారం అందిస్తాం” అని ఎమ్మెల్యే నాగరాజు భరోసా ఇచ్చారు…
అనంతరం మార్గమధ్యలో వెళుతూ ఒక వృద్ధ రైతు మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పొలంలో వాటిలను సేకరిస్తుండగా ఆ రైతుతో మాట్లాడి ఆర్థిక సాయం అందిందా లేదా అని అతనితో మాట్లాడి అతనికి భరోసా కల్పించారు…
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుల్లా రవి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న గౌడ్, మహమ్మద్ చోటే వలీ, డైరెక్టర్ గుంటి కుమారస్వామి, నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
