పరికిచెరువు మరియు ఆలయ భూముల కు సరిహద్దులను నిర్ణయించండి.
హైడ్రా కమిషనర్ కు వినతి.
కుత్బులాపూర్ మండలం గాజులరామారం జోన్ లోని పరికిచెరువు మరియు జగద్గిరిగుట్ట లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను సర్వే చేసి సరిహద్దులను నిర్ణయించి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని కోరుతూ నిన్న సోమవారం రోజున హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి పరికిచెరువు పరిరక్షణ కమిటీ సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
పరికిచెరువు పరిరక్షణ కమిటీ నాయకులు ఉమా మహేష్, సాయి పంతుల, పవన్ ,వంశీ లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని ప్రజావాణిలో కలిసి గతంలో పరికిచెరువు మరియు ఆలయ భూములకు సంబంధించి అన్యాక్రాంతం కాకుండా హైడ్రాధికారులు చర్యలు తీసుకున్నారని దానివల్ల భూకబ్జాలు తగ్గిపోయినప్పటికీ, ఒకవేళ సరిహద్దులు నిర్ణయించకపోతే ఏదో ఒక రోజు వాటిని కూడా కబ్జాదారులు అమ్మేసే పరిస్థితి ఏర్పడుతుందని దానివల్ల పేద ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి నష్టం జరగకుండా సరిహద్దులను నిర్ణయించి ఫెన్సింగ్ వేయాల్సిందిగా కోరడం జరిగింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి స్థానిక అధికారులకు ఫెన్సింగ్ వెయ్యడానికి చర్యలు చేపట్టాలని అక్కడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
