చిలకలూరిపేట
పట్టణం లోని స్థానిక సి ఆర్ క్లబ్ లో నిర్వహిస్తున్న న్యూ షావులెన్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థుల ప్రతిభ జాతీయస్థాయి టోర్నమెంట్లో బంగారు పతకాలు కైవసం
ఈనెల 23వ తారీఖున జరిగిన జాతీయస్థాయి కుంగ్ ఫు అండ్ కరాటే టోర్నమెంట్లో చిలకలూరిపేట పట్టణానికి చెందిన న్యూ షావులేని కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు కటా విభాగంలో బంగారు పతకాలు సాధించి అబ్బురపరిచారు సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో వారి యొక్క ప్రతిభను కనపరిచి బంగారు పతకాలని కైవసం చేసుకున్నారు వారికి సి ఆర్ క్లబ్ లో అకాడమీ మాస్టర్లు మరియు క్లబ్ పెద్దల చేత అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమంతరావు, కాళిదాసు,విద్యార్థులని మెడల్స్ తో సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు
సబ్ జూనియర్ విభాగాల్లో కటావిభాగంలో వైభవ్,శశాంక్,షణ్ముఖులు అద్భుత ప్రదర్శన ఇచ్చి అలాగే జూనియర్ విభాగాల్లో సమీర్,అష్రాఫ్, అఖిల్ పాల్గొని తమ సత్తాని చాటారు వారికి శిక్షణ ఇచ్చిన మాస్టర్లను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు అకాడమీ మాస్టర్ బత్తుల విక్రమ్ మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో గత పది సంవత్సరాలుగా స్థానిక సీఆర్ క్లబ్ లో ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నామని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తెలుసుకొని తప్పనిసరిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ సమాజంలో వారిపై జరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటించేందుకు వారికి మానసిక దృఢత్వానికి ఆత్మస్థైర్యానికి అదేవిధంగా ఫిట్నెస్ గా ఉండేటందుకు తోడ్పడుతుందని సెల్ఫ్ డిఫెన్స్ లో ప్రత్యేకమైన శిక్షణను సీనియర్ మాస్టర్ అకాడమీ చీఫ్ దర్యావలి నేర్పిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలోమాస్టర్ యడ్ల సురేష్, ఇన్ స్ట్రాక్టటర్ షేక్ రబ్బానీ, సీనియర్ విద్యార్థులు…..పి.సాకేత్, షేక్ కమురుద్దీన్,ఎమ్ సుదీర్ మరియు అకాడమీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
