జిల్లా చెస్ విజేతలు చెన్నూరు విద్యార్థులు
** అభినందించిన జనవిజ్ఞాన వేదిక సభ్యులు
సాక్షిత ప్రతినిధి – గూడూరు / తిరుపతి: తిరుపతి జిల్లా గూడూరు జనవిజ్ఞాన వేదిక (జేవివి) ఉపాధ్యక్షులు చెంచు నారాయణ, నాగరాజు ఆధ్వర్యంలో తిరుపతి సైన్స్ సెంటర్లో జరిగిన జిల్లా స్థాయి చెస్ సైన్స్ పరీక్షలలో చెన్నూరు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వారిలో తరుణ్, ఆదిత్య, వహీద్ అహ్మద్ మొదటి బహుమతి గెలుచుకున్నారు. జిల్లాస్థాయిలో మొదటి బహుమతి వచ్చిన విద్యార్థులను గూడూరు జనవిజ్ఞాన వేదిక సభ్యులు చెన్నూరు బాలుర స్కూల్ కి వెళ్లి వారికి బహుమతులు ప్రదానం చేసి టీచర్ల సమక్షంలో వారిని అభినందించారు. రాష్ట్రస్థాయి పరీక్షలలో కూడా మొదటి బహుమతి గెలవాలని కోరారు. విద్యార్థులు మొదటి బహుమతి వచ్చేలాగా కృషిచేసిన సైన్స్ టీచర్లను కూడా అభినందించి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జే.వి.వి.గౌరవ అధ్యక్షుడు పురుషోత్తమ రావు, చెంచు నారాయణ, నాగరాజు, ప్రభాకర్, స్కూల్ హెచ్ఎం బాలనాగమ్మ, వీరాస్వామి, చంద్రశ్రీ, లోకేశ్వరి, శ్రీవాణి, సునీత, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
