హైమస్ట్ లైట్ల ఏర్పాటుతో గ్రామాల్లో వెలుగులు
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని తొట్టిపంపు, మర్రిగూడెం, అబ్బుగూడెం, పెంట్లం గ్రామపంచాయతీల్లో కొత్తగా ఏర్పాటు చేసిన హైమస్ట్ లైట్లను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రివేళ గ్రామాల్లో చీకటి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలు భయ పడకుండా పిల్లలు వృద్ధులు సురక్షితంగా తిరగడానికి హైమస్ట్ లైట్లు ఉపయోగపడతాయన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వెలుగులు నింపే ఆలోచనతో ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. హైమస్ట్ లైట్ల ఏర్పాటుతో గ్రామాలు రాత్రిపూట వెలుగులతో మెరిసిపోవడమే గాక రాకపోకలకు ఇబ్బంది ఉండదన్నారు. దొంగతనాలు దోపిడీలు ప్రమాదాలు తగ్గుతాయి. పండుగలు వేడుకలు నిర్వహించడానికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
