తిరుమలకుంట లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ
సంక్షేమ పథకాలతో ప్రజల నమ్మకం గెలుచుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ నేతలు
సాక్షిత : అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీ లో సోమవారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సీసీ సత్యనారాయణ ఆధ్వర్యం వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ప్రజల సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు.ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా ముందుకెళ్లేలా సీఎం రేవంత్రెడ్డి ప్రగతి పథకాలతో ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యానించారు
.మహిళల ఆర్థిక స్వావలంబనకు, గౌరవప్రద జీవనానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.కార్యక్రమంలో గ్రామ దీపికలు మామిడి వెంకట మహాలక్ష్మి, జుజ్జురి రేఖ, హైమ, దీపికా, కాంగ్రెస్ నాయకులు జుజ్జురి దుర్గారావు, కోర్సా రాజేష్, టీ.ఎసీ సభ్యుడు, పల్లెల రామలక్ష్మయ్య, బొడ్డు సత్తిబాబు, చేవల మహేష్, కొనకళ్ళ లచ్చియ్య, గడ్డం యేసు, కోన రోశయ్య, కోన లక్ష్మణ రావు, మరియమ్మ, తరుణ్, నాగు, మనోహర్, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
