1 కోటి 10 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి కార్పొరేటర్ బన్నాల
….
సాక్షిత : అభివృద్ధిలో దూసుకుపోతున్న చిల్కానగర్ డివిజన్ : ఎమ్మెల్యే బండారి
అభివృద్ధిలో నంబర్ 1 డివిజన్ గా చిల్కానగర్ : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
*చిల్కానగర్ డివిజన్ లో
1 కోటి 10 లక్షల రూపాయలతో పలు కాలనీలో బస్తీల్లో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి,
చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీలో బస్తీల్లో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మరియు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
బీరప్ప గడ్డ మస్జిద్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో పలు వీధుల్లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్ పనులకు
ఈస్ట్ కళ్యాణపురి మరియు బ్యాంక్ కాలనీ లోనీ *ఉద్యానవనాల్లో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో పలు మౌలిక వసతుల ఏర్పాటుకు …
పిల్లల ఆట పరికరాలు
(ప్లే ఎక్విప్మెంట్) ,వాకింగ్ ట్రాక్, వాచ్మెన్ రూమ్, సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగు పనులకు
కళ్యాణ్ పూరి లో నూతన వాటర్ పైప్లైన్ ఏర్పాటుకు
చిల్కానగర్ అంబేద్కర్ స్టాచ్యూ వెనుక నుండి డాక్టర్ అశోక్ హాస్పిటల్ క్లినిక్ వరకు సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది.
అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చిల్కానగర్ డివిజన్ ప్రజలకు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని కొనియాడారు.
అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ కి అత్యధికంగా అభివృద్ధి పనులకు నిధులు సేకరించామని ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు దాటాయని చిల్కానగర్ డివిజన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని పెద్ద ఎత్తున నిధులు సేకరించే విషయంలో సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో DE వెన్నెల గౌడ్ AE రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వారి కమిటీ సభ్యులు మహిళా నాయకురాలు, బస్తీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

