పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీవితాలు ఆగమ్హైపోతునాయి
పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి………..సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులుపలుస శంకర్ గౌడ్
సాక్షిత వనపర్తి
సంవత్సరం క్రితము రిటైర్డ్ అయిన టీచర్ శేఖర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవటం వల్లన మానసికంగా ఇబందులు పడడము వల్లన గుండెపోటు
రావటం బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పామాపూర్ లో ఉపాధ్యాయుడు గా పని చేసి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుడు శేఖర్ ఇంటికి వెళ్లి సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పరమరిచించారు. తొమ్మిది లక్షలు ఖర్చు అవడం వల్లన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవటం అధనగా తొమ్మిది లక్షలు కుటుంబానికీ భారం అయింది. ఈలా రాష్ట్రవ్యాప్తంగా చాలా పదవీ విరమణ ఉద్యోగులు ఆర్థికంగా ఆరోగ్య పరంగా చాలా సమస్యలకు గురితున్నారు కావున ప్రభుత్వం వెంటనే పదవీ విరమణ ప్రయోజనాలను చెలించాలనీ డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షనర్ల బెనిఫిట్స్ చెల్లించకుండా పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య, పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదని.
ఏప్రిల్ 2024, నుండి సుమారు తొమ్మిదివేల మంది పైగా రిటైర్ అయిన 20 నెలలు గడిచినప్పటికీ వీరు దాచుకున్న డబ్బులు చెల్లించకపోవడం వలన ఆవేదనకు లోనై దాదాపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 మంది చనిపోయారు నల్లగొండ జిల్లాకు సంబంధించి రిటైర్ అయిన ప్రధానోపాధ్యాయులు సిలువేరు సత్యనారాయణ మతిస్థిమితం కోలిపోయి తప్పిపోయి ఐదు నెలలు అవుతున్నది .వందలాది మంది పదవీ విరమణ ఉద్యోగుల ఆరోగ్య సమస్యలకు గురిఅవుతున్నారు
35 సంవత్సరముల సేవలందించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనర్లకు వారు దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వటానికి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం, ఒకవైపు ఆత్మహత్యలు అనారోగ్య మరణాలు పెరగకముందే వెంటనే 2024 ఏప్రిల్ నుండి నేటి వరకు రిటైర్ అయిన పెన్షనర్ల అందరికీ వారికి రావలసిన బెనిఫిట్స్ చెల్లించాలని ప్రభుత్వ
ఉద్యోగుల
బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శంకర్ గౌడ్ తో పాటూ రిటైర్డ్ టీచర్ భాలస్వామి, సామాజిక కార్యకర్త గంధం నాగరాజు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
