అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను త్వరగా పూర్తి చేయండి :బిఆర్ఎస్ పార్టీ డిమాండ్
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణ పరిధిలో
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే గుంతలను పూడ్చాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జుజ్జూరి వెంకన్న బాబు తెలిపారు. అశ్వారావుపేట స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ నుండి బైక్ ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తక్షణమే గుంతలను పూడ్చాలని దరఖాస్తును బుధవారం నాడు అందజేశారు. ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్న బాబు ప్రసంగించారు. వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రోడ్లు ప్రమాదాలకు నిలియంగా మారాయని తక్షణమే గుంతలను పూడ్చాలని లేని పక్షంలో మరింత ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాలతో “గుంతలను పూడ్చండి ప్రజల ప్రాణాల్ని కాపాడండి” అంటూ నినాదంతో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని ఇకనైనా ప్రభుత్వం సమస్యను గుర్తించి ప్రజల ప్రాణాలను ప్రమాదాల బారి నుండి కాపాడాలని కోరారు.
అలాగే సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదని రహదారులను వదిలేసారని సమస్యలను గాలికి వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జె. శ్రీరామ్మూర్తి, రఘురాం, ఎస్ వీర్రాజు, ఎన్ వెంకన్న బాబు, ఎండి హుస్సేన్, ఎం నవీన్ నాయక్, హెచ్ వంశీ నాయక్, తల్లాడి వెంకటేశ్వరరావు, గోవింద్, తాళం సూరిబాబు, ఎన్ రాంబాబు, సిహెచ్ బజారయ్య, పద్దం జోగారావు, కృష్ణ, కాశి కాళహస్తి, తూంపాటి రమేష్, కే చిరంజీవి, సూరిబాబు, జి నవీన్ బాబు, చరణ్, వెంకటస్వామి, కాటూరి నాగేంద్ర, అమీర్, రహమత్, పానుగంటి లక్ష్మణరావు, మొడియం జగన్నాథం, ఉప్పల రత్నాకర్, తల్లాడి వెంకటేశ్వరరావు, రాము, వీరబాబు, అంకిరాజు, నక్క రాంబాబు, రాంబాబు, ధర్మ, సురేష్, తదితరులు పాల్గొన్నారు. పేదల గూడు కొల్చడం అన్యాయమే పేదలను ఆదుకోవాల్సిందే.
చెప్పా పెట్టకుండా పేదలు ఇల్లు కూల్చటం కాంగ్రెస్ కే సాధ్యమైంది. తక్షణమే ఆదుకోవాలి బిఆర్ఎస్ డిమాండ్.
అశ్వారావుపేట మండలంలోని తాశీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో పేదల గూడు కుల్చిన విషయం కై నిరసిస్తూ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు జుజ్జురి వెంకన్న బాబు ఆధ్వర్యంలో మెచ్చా నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పేదల నిరసనకు బిఆర్ఎస్ పక్షాన మద్దతు ఇవ్వడం జరిగింది. తక్షణమే పేదలను ఆదుకోవాలని సిపిఐ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
