*ఆక్సిమెడ్ గాస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

Sakshitha news

*ఆక్సిమెడ్ గాస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు శంభీపూర్ క్రిష్ణ

సాక్షిత న్యూస్, నవంబర్ 16, కుత్బుల్లాపూర్:

పటాన్ చెరునియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైస్ పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిమెడ్ గాస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో… కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు శంభీపూర్ క్రిష్ణ పాల్గొని… ఆక్సిమెడ్ గాస్ ఇండస్ట్రీస్ యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శంభీపూర్ క్రిష్ణ మాట్లాడుతూ… సరైన వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించడం, క్రమం తప్పకుండా నిర్వహణతో పాటు…పరికరాలను నిర్వహించడం, వాయువుల సరైన నిల్వ మరియు నిర్వహణను నిర్ధారించడం తదితర భద్రత వంటి ముఖ్యమైన చర్యలను జాగ్రత్తగా చూసుకోవాలని… యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు

Scroll to Top