2025-26 విద్యాసంవత్సరానికి ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కొరకై దరఖాస్తుల ఆహ్వానం
….
సాక్షిత వనపర్తి :
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి బీసీ సంక్షేమశాఖ అండగా నిలుస్తోందని వనపర్తి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీ ముజాహిద్ ఖాన్ గారు తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గాను 9వ, 10వ తరగతుల బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ప్రభుత్వ, జడ్పిహెచ్ఎస్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా https://telan-ganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి. ఈ విషయంలో పాటశాలల ప్రధానోపాధ్యయులు, విద్యార్థులకు సహకరించాలి అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.4,000 ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ మంజూరు చేస్తామని ముజాహిద్ ఖాన్ పేర్కొన్నారు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాల విషయంలో విద్యార్థులు పూర్తి జాగ్రత్త వహించాలని ఆయన వివరించారు. ఆధార్ కార్డు, కుల ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం (గ్రామీణ రూ.1,50,000 లోపు పట్టణ ప్రాంతములో రూ.2,00,000 లోపు), పాస్పోర్ట్ సైజు ఫోటో, బ్యాంకు పాస్బుక్ కాపీ, స్టడీ సర్టిఫికేట్ మరియు ఆన్లైన్ దరఖాస్తు హార్డ్ కాపీఈ పత్రాలను పూర్తిగా జతపరచాలని సూచించారు.
ఆన్లైన్ దరఖాస్తు అనంతరం, అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలతో కూడిన హార్డ్ కాపీలను వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయానికి తప్పనిసరిగా అందజేయాలని కోరారు. పత్రాలు అసంపూర్ణంగా ఉంటే దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
