పల్నాడు జిల్లా చిలకలూరిపేట
ఆక్స్ఫర్డ్ స్కూల్ 2కె రన్
పట్టణంలో ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బాలల దినోత్సవంను పురస్కరించుకొని శుక్రవారం ఉదయం గుర్రాల చావడి వద్ద 2కె రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, పురపాలక సంఘ చైర్మన్ షేక్ రఫాని, అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమేష్, కల్పతరువు చిట్స్ పఠాన్ జాఫర్ ఖాన్, ఎం కె ఎస్ మొహిద్దిన్ బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ చైర్మన్, ఈసుబ్ వలి లక్కీ రోడ్ లైన్స్, వేటపాలెం సుభాని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సయ్యద్ జమీర్ పట్టణ వైసిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు, సయ్యద్ రఫీ టిడిపి నాయకులు హాజరయ్యారు.
- ఈ సందర్భంగా అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ…
- ముందుగా విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యానికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- 2కె రన్ యొక్క ప్రధాన ఉద్దేశం.
- చిన్నారుల రక్షణ,
- బాలికల రక్షణ,
- చరవాణి మినహాయింపు,
- రోడ్డు ప్రమాదాలు.
- నాలుగు అంశాలు సమ్మేళనం చేస్తూ
- వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు అవగాహన కలిగే విధంగా ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
- మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా మాట్లాడుతూ…..
- బాల, బాలికల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి.
- చరవాణి కి బానిసలుగా మారుతున్న నేటి బాల బాలికలు
- కన్నీటి శోకంలో మునిగిపోతున్న బాల, బాలికల సంరక్షకులు.
- సామాజిక కార్యక్రమాలలో పాత్రికేయులు భాగస్వాములై నేటి బాల, బాలికలను సంరక్షించాలి.
- 2కె రన్ వంటి సామాజిక కార్యక్రమాలు మున్ముందు ఆక్స్ఫర్డ్ స్కూల్ మరెన్నో నిర్వహించిలి.
- నవ సమాజ అభివృద్ధి ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆశయం.
- ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యానికి విద్యార్థిని, విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్ హనీఫ్ మాట్లాడుతూ…..
- పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- నేటి బాల, బాలికలకు మంచి భవిష్యత్తు ఏర్పడటమే 2కె రన్ ముఖ్య ఉద్దేశం,
- చరవాణి తో బాల,బాలికలు దుర అలవాట్లు లోన్ అవుతున్నారు.
- వీటి మీద పూర్తి అవగాహన కలిగె విధంగా 2కె రన్ ఏర్పాటు చేశాం.
- ప్రధానంగా రెండవది రోడ్డు ప్రమాదాలు
- మైనర్ బాల,బాలికలు రోడ్లపై డ్రైవింగ్ చేయడం ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
- సంవత్సరానికి 1,50,000 మంది మైనర్లు కాలం చేయడం జరుగుతుంది.
- బాల,బాలికల తల్లిదండ్రులు సంరక్షకులు
- ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించుకొని ఈ రోడ్డు ప్రమాదాలు నివారించే బాధ్యత తీసుకోవాలి.
- ఈ కార్యక్రమాని కి హాజరైన ముఖ్య అతిథులకు మా ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం తరఫున ధన్యవాదాలు.
- ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, చిన్నారులు, తల్లిదండ్రులు, సంరక్షకులు,పి.ఈ.టి చంటి పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

