చేవెళ్ల నియోజకవర్గం:-
మొయినాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామంలో నూతనంగా నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసి, లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నియామక పత్రాలను అందజేసిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య”
అనంతరం మొయినాబాద్ పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మొయినాబాద్ మున్సిపల్ మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.40,04,640/- (రూపాయలు నలభైలక్షల నాలుగువేల ఆరువందలనలబై) విలువ గల 40 కళ్యాణ లక్ష్మీ / షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
