ప్రవేట్ ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లు, క్లినిక్లు ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివ్ 2010 కి లోబడి ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
…..
సాక్షిత వనపర్తి :
ప్రైవేట్ ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010కు లోబడి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మధ్యాహ్నం ఐ.డి. ఒ.సి కాన్ఫరెన్స్ హాల్లో ప్రయివేట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
2 ఆసుపత్రులు, 4 క్లినిక్ లు, 2 డయాగ్నొస్టిక్ సెంటర్ లు దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలన చేసింది. రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న సృష్టి హాస్పిటల్ వనపర్తి, మహాలక్ష్మి పాలీ క్లినిక్ వనపర్తి లకు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న రాజు పాలీ క్లినిక్, రమేష్ పాలీ క్లినిక్ లకు కమిటీ ఆమోదం తెలిపింది.
శ్రీవాసవి ఆయుర్వేద క్లినిక్, శ్రీనివాస డయాగ్నోస్టిక్, ఓంకార్ డయాగ్నోస్టిక్, పల్స్ ఆసుపత్రికి సంబంధించి బయో మెడికల్ వేస్టేజ్ ధృవీకరణ పత్రం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్లో పెట్టింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రులు నిబంధనలకు తు.చ. తప్పకుండ పాటించాలని, సకాలంలో రెన్యువల్ కు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రులు, క్లినిక్ లలో రేట్ ఛార్ట్స్ తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాసులు, డి ఎస్పీ ఉమా మహేశ్వర రావు, ఇతర డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
