ప్రతిరోజు ప్రమాదాలకు నిలయంగా మారిన యూటర్న్ రాంగ్ రింగ్ రోడ్
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణ మున్సిపాలిటీలో బస్టాండ్ నుండి భద్రాచలం వెళ్లే మార్గంలో సరైన చోట మార్గం ఇవ్వకుండా వారి సొంత ఆలోచనతో మార్గం ఇవ్వడం వలన అనునిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ కటింగ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ సైడ్ నుండి ఇటు, ఈ సైడు నుండి అటు వెళ్లే వాళ్లకు మార్గము అర్థం కావడం లేదు. అందువలన ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. భారీ వాహనాలకు కటింగ్ చాలా ఇబ్బంది కరంగా ఉంది. ఇలాంటి అభివృద్ధి ఎవరి కోసం చేస్తున్నారో ప్రజలు మాకు అర్థం కావడం లేదు అని అంటున్నారు. ఈ కటింగ్ లో వెళ్లాలంటే మా ప్రాణం మీదకు వస్తుంది. ఈ సమస్యను పట్టించుకునే వారు ఎవరూ లేరు ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అని బాధితులు అంటున్నారు. ఆ చుట్టు ప్రక్కల ఉన్న షాప్ యజమానులు కూడా ఈ కటింగ్ వలన రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు పట్టించుకోవడంలేదని వారు అంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని వాహనదారులు,స్థానికులు అంటున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
