సాక్షిత : దేవస్థానం ఈవో ఛాంబర్లో ఆలయ చైర్మన్, ఈవో ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు.
భక్తుల సౌకర్యార్థం అన్ని ప్రధాన పనులు త్వరగా పూర్తి కావాలని, భవాని దీక్షలు సమయానికి ఏ మేరకు అందుబాటులో ఉంటాయో ఇంజినీరింగ్ అధికారులు చెప్పాలని ఆలయట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధా కృష్ణ (గాంధీ) కోరారు.
కొత్త అన్న ప్రసాదం భవనం పనులు పూర్తి చేయడం, లడ్డు పోటు నిర్మాణం పూర్తి, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి గురించి ఇంజినీర్లతో, అనంతరం నిర్మాణ కాంట్రాక్టర్స్ తో మాట్లాడి, ఎన్నిరోజుల్లో పూర్తి అవుతాయో లిఖిత పూర్వకంగా తెలపాలని, దేవదాయ కమిషనర్ ప్రతి రోజు ఈ పనులు పై నివేదిక అడుగుతున్నారని ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు.
భక్తులకు ఉపయోగపడే ప్రతీ పనిని త్వరగా చేయాలని, భక్తుల సంఖ్య పెరిగిన రీత్యా సదుపాయాల కల్పన మెరుగ్గా ఉండాలని చైర్మన్, ఈవో పేర్కొన్నారు.
త్వరలో దేవాదాయ మంత్రి, సెక్రటరీ, కమిషనర్ వార్లు నిర్వహించే సమీక్ష కు సిద్ధం కావాలని, అన్ని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రాంబాబు, అసిస్టెంట్ కమీషనర్ రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వెంకట రెడ్డి, సుధారాణి, చంద్రశేఖర్, రమేష్ బాబు, శ్రీనివాస్, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
