భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
……
సాక్షిత : అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అనుకోని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందు జాగ్రత్తగా అనువైన ఆశ్రయ కేంద్రాలకు(షెల్టర్లు) తరలించాలన్నారు.
ప్రజలు జిల్లా కలెక్టరేట్ లో అధికారులు 0861 2331261, 7995576699 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని, ప్రజలకు అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు ప్రధానంగా మున్సిపల్, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ , విపత్తు నిర్వహణ తదితర శాఖల అధికారులు ప్రజలు అందుబాటులో ఉంటారన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
