పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం – బండి రమేష్
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో 4,092 కొత్త పెన్షన్లు మంజూరు చేయడం హర్షణీయం
ఇది ప్రజా ప్రభుత్వమని, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని TPCC ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి, మూసాపేట, బోయిన్పల్లి సర్కిళ్ల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 4,092 పెన్షన్లను మంజూరు చేసింది. ఈ పెన్షన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా లభించనుంది. బుధవారం మూసాపేటలోని ఆంజనేయ నగర్ కమ్యూనిటీ హాల్లో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి , మరియు మాధవరం కృష్ణారావు , మరియు బండి రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణకు విదేశీ పెట్టుబడులను భారీ ఎత్తున ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో సున్నం చెరువు, నల్ల చెరువుల అభివృద్ధి, విస్తరణ, సుందరీకరణ పనులను కోట్లాది రూపాయలతో చేపడుతున్నామని పేర్కొన్నారు.
గత మూడేళ్లలో నియోజకవర్గ పరిధిలో సుమారు 20,000 మందికి కొత్త రేషన్ కార్డులు అందించడం జరిగిందన్నారు. రూ.180 కోట్లతో మూసాపేట వద్ద బ్రిడ్జి నిర్మాణంతో పాటు, జేఎన్టీయూ వద్ద స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని బండి రమేష్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST