ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం: కూన శ్రీశైలం గౌడ్ *
!!కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ నివాస కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు!!.
▪️ఈ సందర్భంగా వివాహ శుభకార్యాలు, అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికలు అందజేయడంతో పాటు, మంచినీరు, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కూన శ్రీశైలం గౌడ్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించగా, మిగిలిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
▪️ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST