జగద్గిరిగుట్ట సదర్ సమ్మేళనం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

జగద్గిరిగుట్ట సదర్ సమ్మేళనంలో కూన శ్రీశైలం గౌడ్ జనసందోహం మధ్య కనిపిస్తున్నారు. చుట్టూ ప్రజలు, ఎర్రని వస్త్రాలతో అలంకరించిన దున్నపోతు ఉన్నాయి.

Sakshitha news

జగద్గిరిగుట్ట సదర్ సమ్మేళనం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

జగద్గిరిగుట్టలో నిర్వహించిన 17వ సదర్ సమ్మేళన మహోత్సవం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సదర్ సంబరాలను తిలకించి, యాదవ సోదరుల ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి సమ్మేళనాలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో సదర్ ఉత్సవాల ప్రాధాన్యత ఎంతో గొప్పదని తెలిపారు.

అనంతరం ఇంతటి ఘనమైన వేడుకలను క్రమబద్ధంగా, అంగరంగ వైభవంగా నిర్వహించిన సదర్ ఉత్సవ సమితి వారికి కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు…

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శేఖర్ యాదవ్ మరియు నాయకులు బుచ్చిరెడ్డి,మోతే శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు