అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, పడి పూజా కార్యక్రమం

Sakshitha news

అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ పరిధిలోని కొంపల్లిలో శ్రీశ్రీశ్రీ హరహరసుత అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని హిల్ కౌంటీలో కోలన్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.