మెడికల్ షాపుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు వినతి

మెడికల్ షాపుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు ప్రతినిధులు వినతి చేశారు. సమావేశంలో పలువురు పాల్గొని తమ సమస్యలను వివరించారు.

Sakshitha news

మెడికల్ షాపుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు వినతి

▪️మేడ్చల్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు యరమాద హరి నారాయణ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు నేడు షాపూర్ నగర్‌లోని నివాసంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

▪️ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు మెడికల్ షాపులపై నిర్వహించిన తనిఖీల అనంతరం పలు షాపులకు నిరవధిక సస్పెన్షన్లు విధించడంతో కెమిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూన శ్రీశైలం గౌడ్ గారు సానుకూలంగా స్పందించి, ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రి, అధికారుల దృష్టి కి. సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

▪️ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బ్రహ్మానందం, ముక్తార్ అలీ, కృష్ణ గౌడ్, మధు గౌడ్, మొహమ్మద్ షాకీర్, ప్రభాకర్ గౌడ్, సంతోష్ గౌడ్, నరేష్ గౌడ్, సునీల్ గౌడ్, అభిరామ్ గౌడ్, ప్రదీప్ గౌడ్, శేఖర్ గౌడ్, ప్రవీణ్, రాము, సంగమేష్, నవీన్, అశోక్, షాజహాన్, పవన్ గౌడ్, రాజశేఖర్, శ్రీధర్ గుప్తా, శ్రీధర్, రాజు, విక్రమ్, సత్యనారాయణ తదితర కెమిస్టులు పాల్గొన్నారు.