సాయిబాబా నగర్ – సూరారం కాలనీ RGK సమస్యలపై BRS సీనియర్ నాయకులు

Sakshitha news

సాయిబాబా నగర్ – సూరారం కాలనీ RGK సమస్యలపై BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ని కలిసిన ప్రజలు*

సాయిబాబా నగర్ పరిధిలోని సూరారం కాలనీ RGK ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలపై స్థానిక ప్రజలు *BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ దగ్గరకు వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవడం జరిగింది.

వారి సమస్యలను సావధానంగా విన్న వారాల వినోద్ కుమార్ , ఈ సమస్యలన్నింటినీ కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, మీకు ఎల్లవేళలా, ఎలాంటి సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో RGK కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.